- ఇంట్లో తయారు చేసే అల్లం-వెల్లులి పస్తేలో గాని, పచ్చి మిర్చి ముద్ధలోగాని టీ స్పూన్ వేడి నూనె, చిటికెడు ఉప్పు జత చేసి ఉంచితే ఎక్కువ కాలం నిల్వ వుంటుంది.
- బంగాళదుంప ముక్కలు తొందరగా ఉడకాలంటే కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో 20 నిమిషాలపాటు నానవెట్టి వండితే సరి.
- పూరీలు కరకరలాడాలంటే గోధుమ పిండితో బాటు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లౌర్ కూడా జత చేసి తడపాలి.
- తేనె మరీ చిక్కబదినట్టు వుంటే కాస్త వేడి చేసిన స్పూన్ ను తేనె బాటిల్లో ముంచి తీస్తే పలచబడుతుంది.
- అన్నం వండేటప్పుడు ఎసరు నీళ్ళలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా విదివిదిలాడుతుంది.
- పెరుగు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పెరుగు వున్నా పాత్ర నిండా నీళ్ళు పోసి ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు మారుస్తూ రిఫ్రిజ్రటర్లో నిల్వ చేయాలి.
- పెరుగు పులుసిపోయినప్పుడు మస్లిన్ క్లోత్లో వేసి నీటినంత వంపేయాలి. తరువాత గట్టి పెరుగులో కొద్దిగా పాలు కలిపితే తాజాగా, రుచిగా వుంటుంది. పెరుగు వడగట్టగా మిగిలిన పుల్లటి నీరు కూరల్లో వేసి వండితే గ్రేవికి రుచిగా వుంటుంది.
- టేబుల్ స్పూన్ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అరటి చిప్స్ పై చిలకరించిన తరువాత ఫ్రీ చేయాల్లి . ఇలా చేస్తే అరటి చిప్స్ కరకరలాడతాయి.
- ఫ్లౌర్ పై కూదిగుడ్డు పడితే ఆ ప్రదేశంలో కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత పేపర్ తో గాని క్లాత్‌తో గాని సుబ్రపరిస్తే తేలికగా మారక వదులుతుంది.
- నిమ్మచేక్కలను ఎండలో యండబెట్టిన తరువాత పొడి చేసి నిల్వచేయాలి. తెల్లని దుస్తులకు మొండి మరకలితే వాటిని డిటర్జెంట్ పౌడెర్తో పాటు ఒక టీ స్పూన్ నిమ్మ పొడిని వేసి నానబెట్టి వుతికితే మారక వదలడంతో పాటు దుస్తులు మరింత తెల్లగా మెరుస్తాయి.
- పట్టు చీరలు వుతికేతప్పుడు టీ స్పూన్ నిమ్మరసం వేసి వుతికితే వాటిరంగు వదలదు.
- చిటికెడు వంట సోడా ను టీ కప్పులో వేసి నిమిషం తర్వాత సుబ్రపరిస్తే టీ మరకలు మటుమాయమౌతాయి.
Monday, July 26, 2010
house tips
కాకరకాయ నిలువుగా కట్ చేసి గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా గోధుమ పిండి , ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూరి అరగంట తరువాత వండితే చేదు తగ్గడంతో బాటు రుచిగా కూడా వుంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
hey nice tips yaarrrrr... very useful one.....
ReplyDelete