Monday, July 26, 2010

house tips

కాకరకాయ నిలువుగా కట్ చేసి గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా గోధుమ పిండి , ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూరి అరగంట తరువాత వండితే చేదు తగ్గడంతో బాటు రుచిగా కూడా వుంటాయి. 
  • ఇంట్లో తయారు చేసే అల్లం-వెల్లులి పస్తేలో గాని, పచ్చి మిర్చి ముద్ధలోగాని టీ స్పూన్ వేడి నూనె, చిటికెడు ఉప్పు జత చేసి ఉంచితే ఎక్కువ కాలం నిల్వ వుంటుంది.
  • బంగాళదుంప ముక్కలు తొందరగా ఉడకాలంటే కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో 20  నిమిషాలపాటు నానవెట్టి వండితే సరి.
  • పూరీలు   కరకరలాడాలంటే గోధుమ పిండితో బాటు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లౌర్ కూడా జత చేసి తడపాలి.
  • తేనె   మరీ చిక్కబదినట్టు వుంటే కాస్త వేడి చేసిన స్పూన్ ను తేనె బాటిల్లో ముంచి తీస్తే పలచబడుతుంది. 
  • అన్నం  వండేటప్పుడు ఎసరు నీళ్ళలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా విదివిదిలాడుతుంది.
  • పెరుగు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పెరుగు వున్నా  పాత్ర నిండా నీళ్ళు పోసి  ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు మారుస్తూ రిఫ్రిజ్రటర్లో నిల్వ చేయాలి.
  • పెరుగు పులుసిపోయినప్పుడు మస్లిన్ క్లోత్లో వేసి నీటినంత వంపేయాలి. తరువాత గట్టి పెరుగులో కొద్దిగా పాలు కలిపితే తాజాగా, రుచిగా వుంటుంది. పెరుగు వడగట్టగా మిగిలిన పుల్లటి నీరు కూరల్లో వేసి వండితే గ్రేవికి రుచిగా వుంటుంది.
  • టేబుల్ స్పూన్ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అరటి చిప్స్ పై  చిలకరించిన తరువాత ఫ్రీ చేయాల్లి . ఇలా చేస్తే అరటి చిప్స్ కరకరలాడతాయి.
  • ఫ్లౌర్ పై కూదిగుడ్డు పడితే ఆ ప్రదేశంలో కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత పేపర్ తో గాని క్లాత్తో గాని సుబ్రపరిస్తే తేలికగా మారక వదులుతుంది.
  • నిమ్మచేక్కలను ఎండలో యండబెట్టిన తరువాత పొడి చేసి నిల్వచేయాలి. తెల్లని దుస్తులకు మొండి మరకలితే వాటిని డిటర్జెంట్ పౌడెర్తో పాటు ఒక టీ స్పూన్ నిమ్మ పొడిని వేసి నానబెట్టి వుతికితే మారక వదలడంతో పాటు దుస్తులు మరింత తెల్లగా మెరుస్తాయి.
  • పట్టు చీరలు వుతికేతప్పుడు టీ స్పూన్ నిమ్మరసం వేసి వుతికితే వాటిరంగు వదలదు.
  • చిటికెడు వంట సోడా ను టీ కప్పులో వేసి నిమిషం తర్వాత సుబ్రపరిస్తే టీ మరకలు మటుమాయమౌతాయి.